Wednesday, January 15, 2025

చిరంజీవి, సురేఖ, వెంకటేష్,నీరజ ల అమెరికా పెళ్లి ఫోటోలు వైరల్    

ఎంత ఎత్తుకి ఎదిగినా ఒదిగి ఉండే తత్వం మెగాస్టార్ చిరంజీవిది. తన మిత్రుల కోసం ఏమైనా చేయడానికి ఎంత దూరం వెళ్లడానికైనా కూడా వెనుకాడడు. మొదట నుంచి కూడా స్నేహానికి  ఎంతో ఇంపార్టెన్స్ ఇస్తాడు. ఈ విషయం చాలా సార్లు రుజవయ్యింది. చిరు ప్రస్తుతం విశ్వంభర అనే సోషియో ఫాంటసీ మూవీ చేస్తున్నాడు. సోషియో ఫాంటసీ మూవీ చేయడం   అంటే అంత ఆషామాషి కాదు. అందుకు ఎంతో డెడికేషన్ కావాలి.ఇటీవలే ఆ మూవీ షూటింగ్ ప్రారంభమయ్యింది.ఆరు పదుల వయసులో కూడా చిరంజీవి ఎంతో ఉత్సాహంగా ఆ షూటింగ్ లో పాల్గొంటున్నాడు. ఆ మూవీ షెడ్యూల్ తో ఫుల్  బిజీగా ఉన్న చిరు తన స్నేహితుడు కోసం ఖండాంతరాలు దాటి వెళ్ళాడు.

చిరంజీవి స్నేహితుడి పేరు కుమార్ కోనేరు.అమెరికాలోని లాస్ ఏంజిల్స్ లో ఆయన  స్థిర పడ్డాడు.ఈయన చిరంజీవి కి చాలా ప్రియ మిత్రుడు. ఈయన కుమారుడైన కిరణ్ వివాహం తాజాగా లాస్ ఏంజిల్స్ లో జరిగింది. అత్యంత వైభవంగా జరిగిన ఈ వేడుకల్లో చిరంజీవి తన భార్య సురేఖ తో సహా  పాల్గొని నూతన జంటకి  ఆశీర్వచనాల్ని అందించాడు. అలాగే ప్రముఖ హీరో  విక్టరీ వెంకటేష్ కూడా తన సతీమణి  నీరజతో కలిసి వివాహ వేడుకల్లో పాల్గొన్నాడు. ఈ మేరకు అందరు కలిసి దిగిన పిక్స్ ఇప్పుడు సోషల్ మీడియాలో సంచలనం సృష్టిస్తున్నాయి.

 తెలుగు సినిమా పరిశ్రమకి  చెందిన  టాప్ ప్రొడ్యూసర్స్ కూడా ఈ వివాహవేడుకల్లో పాల్గొన్నారు. మైత్రి మూవీ మేకర్స్ అధినేతల్లో ఒకరైన నవీన్ యెర్నేని, పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ అధినేత టి జె విశ్వ ప్రసాద్,  గీత ఆర్ట్స్  అల్లు అరవింద్  లు వివాహ వేడుకల్లో పాల్గొన్నారు. అలాగే మహేష్ బాబు రాజమౌళితో సినిమాని తెరకెక్కిస్తున్న  దుర్గ ఆర్ట్స్ అధినేత కె ఎల్ నారాయణ కూడా పాల్గొన్నాడు. 

 

Related Articles

Stay Connected

0FansLike
0FollowersFollow
0SubscribersSubscribe
- Advertisement -spot_img

Telangana