Special Trains To Medaram : తెలంగాణ కుంభమేళా మేడారం జాతర(Medaram Jatara)కు రాష్ట్ర ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు చేసింది. దీంతో పాటు భక్తులకు ప్రయాణ సౌకర్యాలు కల్పించింది. టీఎస్ఆర్టీసీ(Medaram Jatara Buses) జాతరకు ప్రత్యేక బస్సులు నడుపుతుంది. కోటి మందికి పైగా మేడారం జాతరకు వస్తారని సమాచారం. మేడారం జాతరకు దక్షిమ మధ్య రైల్వే ప్రత్యేక రైళ్లు(Special Trains To Medaram) నడుపుతోంది. వరంగల్-సికింద్రాబాద్-వరంగల్ (రైలు నెం.07014/07015), సిరిపుర్ కాగజ్నగర్-వరంగల్- సిరిపుర్ కాగజ్నగర్ (రైలు నెం.07017/07018), నిజామాబాద్-వరంగల్-నిజామాబాద్ (రైలు నెం.07019/0720) ప్రత్యేక రైళ్లను నడుపుతున్నట్లు ప్రకటించింది. ప్రత్యేక రైళ్లు.. సికింద్రాబాద్, హైదరాబాద్, సిర్పుర్ కాగజ్ నగర్, బెల్లంపల్లి, మంచిర్యాల, రామగుండం, పెద్దపల్లి, జమ్మికుంట, భువనగిరి, జనగామ, ఘన్పూర్, కామారెడ్డి, మనోహరాబాద్, మేడ్చల్, ఆలేరు మీదు ప్రయాణిస్తాయి.