Hyderabad Crime News : మియాపూర్ లో దారుణం చోటుచేసుకుంది. ఇద్దరు మైనర్ బాలుల మధ్య రూ.200 కోసం జరిగిన ఘర్షణ హత్యకు దారితీసింది. మియాపూర్ పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం……మియాపూర్ లోని న్యూ ఆఫీస్ పెట్ ఆదిత్య నగర్ కు చెందిన ఆస్కార్,షాజన్బే గం దంపతుల కుమారుడు గచ్చిబౌలి లోని ఓ మాల్ లో పని చేసేవాడు.కొద్దిరోజుల క్రితమే పని మానేసిన మైనర్ బాలుడు జులాయిగా తిరుగుతున్నాడు. ఈనెల 14న ఇంటి నుంచి బయటకు వెళ్లిన బాలుడు ఎంతకూ తిరిగి రాకపోవడంతో కుటుంబ సభ్యులు మియాపూర్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు మిస్సింగ్ కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు……అయితే ఈనెల 16న ఆఫీసు పేట ఫ్లైఓవర్ బ్రిడ్జి కింద గుర్తు తెలియని బాలుడు పడి ఉన్నట్లు గుర్తించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు.