తెలంగాణ నుంచే మొదలు – భట్టి
ఇదే తీర్మానంపై డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మాట్లాడుతూ…. బీసీ కులగణన తీర్మాణం ప్రవేశపెట్టడం దేశ చరిత్రలోనే చారిత్రాత్మకమన్నారు. దేశ వ్యాప్తంగా కుల గణన జరుగాలని కాంగ్రెస్ పార్టీ భావిస్తున్నదన్న ఆయన… ఎన్నికల్లో చాలా స్పష్టంగా మేము అధికారంలోకి రాగానే కుల గణన చేస్తామని చెప్పామని గుర్తు చేశారు. కులగణన తెలంగాణ నుంచి మొదలు పెడతామని చెప్పి క్యాబినెట్లో చాలా కులంకుశంగా చర్చించి నేడు అసెంబ్లీలో కుల గణనపై తీర్మాణం పెట్టడం జరిగిందని చెప్పుకొట్టారు. రాష్ట్ర వ్యాప్తంగా కుల గణన తో పాటు సోషల్, ఎకానమిక్, ఎడ్యుకేషన్, పొల్టికల్, ఎంప్లాయిమెంట్ అంశాలపై సర్వే చేయడం జరుగుతుందన్నారు. ప్రతిపక్ష సభ్యులు కుల గణనపై ఏలాంటి ఆందోలన గందరగోళం కావొద్దని సూచించారు. సామాజిక ఆర్ధిక రాజాకీయ మార్పునకు పునాధిగా తెలంగాణ మారబోతుందన్నారు. పది సంవత్సరాలు అధికారంలోకి ఉన్న గత బిఆర్ఎస్ ప్రభుత్వం కుల గణన చేయలేదన్న భట్టి… ఇప్పుడు కుల గణన చేయాలని ఈ ప్రభుత్వం తీసుకున్న మంచి కార్యాక్రమానికి మద్దతు ఇవ్వకుండ రన్నింగ్ కామెంట్రీ చేయడం సరికాదని హితవు పలికారు.