ఇప్పటివరకు 16 దేశాలు
వివాహ సమానత్వాన్ని చట్టబద్ధం చేసిన 16వ (యూరోపియన్ యూనియన్) దేశంగా గ్రీస్ అవతరించినందుకు గర్వంగా ఉందని ఓటింగ్ అనంతరం మిట్సోటాకిస్ ట్వీట్ చేశారు. “ఇది మానవ హక్కులకు ఒక మైలురాయి, నేటి గ్రీస్ – ప్రగతిశీల మరియు ప్రజాస్వామ్య దేశం, యూరోపియన్ విలువలకు కట్టుబడి ఉంది” అని ఆయన రాశారు. ఓటింగ్ ఫలితం వెలువడగానే పార్లమెంట్ వెలుపల గుమిగూడి, తెరపై చర్చను వీక్షిస్తున్న పలువురు మద్దతుదారులు బిగ్గరగా హర్షధ్వానాలు చేసి పరస్పరం ఆలింగనం చేసుకున్నారు. అంతకుముందు ఈ బిల్లును వ్యతిరేకించే వారు ప్రార్థనా మందిరాలు, మత చిహ్నాలను పట్టుకుని నిరసన తెలిపారు.