కాంగ్రెస్ పార్టీపై తీవ్రస్థాయిలో ప్రధాని మోదీ మండిపడ్డారు. ఆ పార్టీకి ఒకే ఒక ఎజెండా ఉంటుందని, అది నన్ను తిట్టడమే అని మోదీ అన్నారు. వీడియో కాన్ఫరెన్సింగ్ ప్రసంగం ద్వారా ‘విక్షిత్ భారత్ విక్షిత్ రాజస్థాన్’కార్యక్రమంలో ప్రసంగించిన ప్రధాని మోదీ పలు విషయాలపై మాట్లాడారు. కాంగ్రెస్ మేడ్ ఇండియాకు మద్దతు ఇవ్వదు, వోకల్ ఫర్ లోకల్ కి కూడా మద్దతివ్వదన్నారు. మోదీని వ్యతిరేకించటమే వాళ్ల నైజం అన్నారు.