షిర్డీ టూర్ టికెట్ ధరలు:
Hyderabad Shirdi Tour Prices 2024: హైదరాబాద్ నుంచి ఆపరేట్ చేసే ఈ షిర్డీ టూర్ ప్యాకేజీ టికెట్ ధరలు చూస్తే…. సింగిల్ షేరింగ్ కు రూ. 7790 గా ఉండగా… డబుల్ షేరింగ్ కు రూ. 6560 ధరగా నిర్ణయించారు. ట్రిపుల్ షేరింగ్ కు రూ. 6550గా ఉంది. స్టాండర్డ్ క్లాస్ లో ట్రిపుల్ షేరింగ్ కు రూ. 4910గా ఉంది. గతేడాది డిసెంబర్ లో ఈ టూర్ ప్యాకేజీ ధరలు చూస్తే… సింగిల్ షేరింగ్ కు రూ. 8,680 ధర ఉండగా.. డబుల్ షేరింగ్ కు రూ.7,010ధరగా ప్రకటించారు. ట్రిపుల్ షేరింగ్ కు 6,840గా నిర్ణయించారు. కంఫార్ట్ క్లాస్ల్ కోచ్ లో ఈ ధరలు ఉంటాయి. గతంలో ఉన్న ధరలతో పోల్చితే… ప్రస్తుతం ధరలు తగ్గాయి. ఈ టూర్ ప్యాకేజీలో టికెట్లు, హోటల్‌లో వసతి, బ్రేక్‌ఫాస్ట్, లంచ్, డిన్నర్ వంటివి కవర్ అవుతాయి. నిబంధనలు కూడా వర్తిస్తాయి. పూర్తి వివరాల కోసం కింద ఇచ్చిన జాబితాను చూడండి. https://www.irctctourism.com/ క్లిక్ చేసి ప్యాకేజీ పూర్తి వివరాలు తెలుసుకోవటంతో పాటు బుకింగ్ చేసుకోవచ్చు.