దేశ రాజధాని ఢిల్లీలో ఘోర అగ్ని ప్రమాదం జరిగింది. అలీపూర్ మార్కెట్లోని ఓ పెయింట్ పరిశ్రమలో ఈ చోటు చేసుకుంది. ఈ ఘటనలో 11 మంది ప్రాణాలు కోల్పోయారు. పలువురికి తీవ్రంగా గాయాలయ్యాయి. అగ్ని ప్రమాదంపై సమాచారం అందుకున్న పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకొని మంటలను అదుపులోకి తెచ్చారు. అగ్నిమాపక సిబ్బంది 22 ఫైరింజిన్లతో మంటలను అదుపులోకి తెచ్చినట్లు చెప్పారు. ప్రమాదంలో గాయపడినవారిని సమీపంలోని ఆస్పత్రులకు తరలించారు. ప్రమాదానికి గల కారణాలపై అధికారులు ఆరా తీస్తున్నారు.