వైసీపీ ప్రభుత్వ అరాచకాలపై తిరగబడాల్సిన సమయం వచ్చేసిందని తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు అన్నారు. సీనియర్ జర్నలిస్ట్ ఆలపాటి సురేష్ రాసిన ‘విధ్వంసం’ పుస్తకావిష్కరణ సభలో పాల్గొన్న చంద్రబాబు.. ఇక 53 రోజులు మాత్రమే సమయం ఉందని గుర్తు చేశారు. కుర్చీని మడతపెట్టి అంటూ సినిమా రేంజ్లో డైలాగ్ చెప్పిన బాబు.. టీడీపీ శ్రేణులను ఉత్సాహపరిచారు. ఈ కార్యక్రమంలో పవన్ కళ్యాణ్, సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ కూడా పాల్గొన్నారు.