Severe cough: సాధారణ దగ్గు, జలుబే తీవ్రంగా మారి వారాలు, నెలలు తరబడి వేధిస్తున్నాయి. ఈ మధ్యన దేశమంతటా తీవ్రమైన దగ్గు, జలుబు వ్యాపిస్తోంది. ఇది ఒక వైరస్ వేవ్‌గా భావిస్తున్నారు ఆరోగ్య నిపుణులు. దగ్గు, జలుబు వారానికంటే ఎక్కువ కాలం వేధిస్తుంటే అది వైరస్ కారణంగానే అని భావించాలి. యాంటీబయోటిక్స్, ఇతర మందులు ఎంత వాడుతున్నా కూడా దగ్గు అదుపులోకి రాకపోవడమే దీని లక్షణం. ఈ దగ్గు తీవ్రంగా మారి తగ్గడానికి సమయం పడుతుంది.