Home ఆంధ్రప్రదేశ్ సూర్యప్రభ వాహనంపై కనువిందు చేసిన వేంకటేశ్వరుడు… తిరుమలకు పోటెత్తిన భక్తులు-lord venkateswara seated on suryaprabha...

సూర్యప్రభ వాహనంపై కనువిందు చేసిన వేంకటేశ్వరుడు… తిరుమలకు పోటెత్తిన భక్తులు-lord venkateswara seated on suryaprabha vahanam in tirumala ,ఆంధ్ర ప్రదేశ్ న్యూస్

0

(1 / 9)

సూర్య‌ప్ర‌భ‌ వాహనం(ఉదయం 5.30 నుండి 8 గంట‌ల వ‌ర‌కు)ఉద‌యం 5.30 గంట‌ల‌కు సూర్యప్రభ వాహన‌సేవ మొద‌ల‌వుతుంది. అక్కడినుండి ఆలయ వాయువ్య దిక్కుకు చేరుకోగానే సూర్యోద‌యాన భానుడి తొలికిర‌ణాలు శ్రీ మ‌ల‌య‌ప్ప‌స్వామివారి పాదాల‌ను స్ప‌ర్శిస్తాయి. ఈ ఘ‌ట్టం భ‌క్తుల‌కు క‌నువిందు చేస్తుంది. సూర్యుడు తేజోనిధి, సకల రోగ నివారకుడు. ప్రకృతికి చైతన్యప్రదాత. వర్షాలు, వాటి వల్ల పెరిగే చెట్లు, చంద్రుడు, అతని వల్ల పెరిగే సముద్రాలు మొదలైనవన్నీ సూర్యతేజం వల్లనే వెలుగొందుతున్నాయి. సూర్యప్రభ వాహనంపైన శ్రీనివాసుని దర్శనం వల్ల ఆరోగ్యం, విద్య, ఐశ్వర్యం, సంతానం వంటి ఫలాలు భక్తకోటికి సిద్ధిస్తాయి. 

Exit mobile version