Trigrahi yogam: ఫిబ్రవరిలో అనేక గ్రహాల కదలికలు కీలకంగా మారనున్నాయి. మాఘ శుక్ల పక్ష దశమి తిథి నాడు గ్రహాల రాకుమారుడు బుధుడు శని దేవుడి తొలి స్వక్షేత్రమైన మకరం నుంచి రెండవ స్వక్షేత్ర రాశి కుంభంలోకి ప్రవేశించబోతున్నాడు. మేథస్సు, తెలివితేటలు, జ్ఞానం, రచనా శక్తి, జర్నలిజం వంటి వాటికి బుధుడు కారకుడిగా భావిస్తారు. మార్చి 6వ తేదీ వరకు బుధుడు ఈ రాశిలోనే ఉంటాడు.