టాలీవుడ్ ఇండస్ట్రీలో నటుడిగా మంచి గుర్తింపు ఉన్నా ఆశించిన స్థాయిలో సక్సెస్ లేని హీరోలలో సందీప్ కిషన్( Sundeep Kishan ) ఒకరు.సందీప్ కిషన్ రెమ్యునరేషన్ సైతం పరిమితంగా ఉంది.
ఊరు పేరు భైరవకోన( Ooruperu Bhairavakona ) ప్రమోషన్స్ లో భాగంగా సందీప్ కిషన్ చెప్పుకొచ్చారు.తాను ఎప్పటికీ విలన్ రోల్స్( Villain Roles ) చేయనని సందీప్ కిషన్ కామెంట్లు చేశారు.
తెలుగు సినిమాలలో విలన్ గా నటించాలని చాలామంది అడుగుతున్నారని సందీప్ చెప్పుకొచ్చారు
టాలీవుడ్ సినిమాల్లో మాత్రమే కాదని ఏ భాష సినిమాల్లో కూడా విలన్ గా చేయనని ఆయన కామెంట్లు చేశారు.నాకు విలన్ గా చేసే ఆసక్తి లేదని విలన్ రోల్స్ చేయడం నా మనసుకు నచ్చదని ఆయన అన్నారు.
చెడ్డవాడిగా నన్ను నేను తెరపై చూసుకోవాలని అనుకోవడం లేదని సందీప్ వెల్లడించారు.నాకు ఇష్టం లేకుండానే ప్రేక్షకులకు విలన్ గా కనిపించాల్సిన అవసరం ఏముందని ఆయన ప్రశ్నించారు.
సినిమాలో ఏదో ఒక స్పెషాలిటీ ఉండి విలన్ రోల్ ను డిఫరెంట్ గా క్రియేట్ చేస్తే నేను ఆ సినిమా చేస్తానని సందీప్ వెల్లడించారు.రెగ్యులర్ విలన్ రోల్ లో కనిపించాలని మాత్రం అనుకోవడం లేదని ఆయన అన్నారు.ధనుష్( Dhanush ) డైరెక్షన్ లో తెరకెక్కిన ఒక సినిమాలో సందీప్ కిషన్ నటించగా త్వరలో ఈ సినిమాకు సంబంధించిన వివరాలు వెల్లడి కానున్నాయని సమాచారం అందుతోంది.
సలార్ 2( Salaar 2 ) సినిమాలో నెగిటివ్ రోల్ లో సందీప్ కిషన్ నటిస్తున్నారంటూ ప్రచారం జరుగుతుండగా ఆ ప్రచారంలో కూడా నిజం లేదని సందీప్ కిషన్ అభిప్రాయపడ్డారు.సందీప్ కిషన్ ఊరు పేరు భైరవకోన సినిమాకు భారీ స్థాయిలో బిజినెస్ జరగగా ఈ సినిమాకు ఎలాంటి రెస్పాన్స్ వస్తుందో చూడాల్సి ఉంది.సందీప్ ను అభిమానించే ఫ్యాన్స్ సంఖ్య అంతకంతకూ పెరుగుతోంది.