Home చిత్రాలు Nellore : నెల్లూరు రోడ్డుప్రమాద ఘటనలో పెరుగుతున్న మృతుల సంఖ్య..

Nellore : నెల్లూరు రోడ్డుప్రమాద ఘటనలో పెరుగుతున్న మృతుల సంఖ్య..

0

నెల్లూరు ( Nellore ) జిల్లాలో చోటు చేసుకున్న రోడ్డు ప్రమాద ఘటనలో మృతుల సంఖ్య ఏడుకు చేరుకుంది.జిల్లాలోని కావలి ముసునూరు టోల్ ప్లాజా( Kavali Musunur Toll Plaza ) వద్ద ప్రమాదం జరిగిన సంగతి తెలిసిందే.

రెండు లారీలు, ప్రైవేట్ బస్సు ఢీకొన్న ఘటనలో మృతుల సంఖ్య ఏడుకు చేరగా.మరో 15 మంది గాయపడ్డారు.

సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని పరిస్థితిని సమీక్షించారు.

అనంతరం ప్రమాదంపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.అయితే టోల్ ప్లాజా సమీపంలో మొదట ఆగి ఉన్న లారీని వెనక నుంచి ఢీకొన్న మరో లారీ.డివైడర్ దాటి ఎదురుగా వస్తున్న ట్రావెల్స్ బస్సును ఢీకొట్టిందని తెలుస్తోంది.

Exit mobile version