Monday, February 3, 2025

Mrunal Thakur : పల్లెటూరు అమ్మాయి అంటూ దారుణంగా అవమానించారు: మృణాల్ ఠాకూర్

మృణాల్ ఠాకూర్( Mrunal Thakur ) పరిచయం అవసరం లేని పేరు మరాఠీ ముద్దుగుమ్మగా మరాఠీ సినిమాలు సీరియల్స్ చేస్తూ ఉన్నటువంటి ఈమె అనంతరం బాలీవుడ్ సినిమా అవకాశాలను అందుకున్నారు.ఇలా బాలీవుడ్ ఇండస్ట్రీలో కొనసాగుతున్నటువంటి ఈమె తెలుగు చిత్ర పరిశ్రమకు కూడా ఎంట్రీ ఇచ్చారు.

 Mrunal Thakur Body Shaming Comments Goes Viral-TeluguStop.com

సీతారామం( Sitaramam ) సినిమా ద్వారా తెలుగు ప్రేక్షకుల ముందుకు వచ్చినటువంటి మృణాల్ ఠాకూర్ మొదటి సినిమాతోనే ఎంతో మంచి విజయాన్ని అందుకున్నారు.ఈ సినిమా మంచి సక్సెస్ కావడంతో ఈమెకు తెలుగులో వరుసగా సినిమా అవకాశాలు వస్తున్నాయి.

ఇలా వరుస సినిమాలలో నటిస్తూ కెరియర్ పరంగా ఎంతో బిజీగా ఉన్నటువంటి ఈమె ఇటీవల ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్నారు.ఈ ఇంటర్వ్యూ సందర్భంగా మృణాల్ ఠాకూర్ బాలీవుడ్ ఇండస్ట్రీలో( Bollywood ) కొనసాగే సమయంలో కెరియర్ మొదట్లో ఎన్నో అవమానాలను ఎదుర్కొన్నాను అంటూ తెలియజేశారు ముఖ్యంగా చాలామంది నేను ఆడిషన్ కి వెళ్ళినప్పుడు నన్ను బాడీ షేమింగ్( Body Shaming ) చేశారు అంటూ ఆవేదన వ్యక్తం చేశారు.

బాలీవుడ్ ఇండస్ట్రీలోకి అడుగు పెట్టిన సమయంలో తాను ఆడిషన్ కి వెళ్లగా ఎన్నో అవమానాలు పడ్డాను చాలామంది నా శరీర బరువు గురించి మాట్లాడుతూ కాస్త శరీర బరువు( Body Weight ) తగ్గొచ్చుగా అంటూ కామెంట్లు చేశారని మరికొందరు నేను సెక్సీగా లేను అంటూ కూడా కామెంట్లు చేశారని మృణాల్ ఠాకూర్ తెలిపారు.ఇక మరికొందరైతే నేను గ్లామరస్ పాత్రలకు అసలు సెట్ అవ్వనని పల్లెటూరు అమ్మాయిల ఉన్నాను అంటూ తన పట్ల ఎన్నో విమర్శలు చేశారంటూ ఈ సందర్భంగా ఈమె చేసిన వ్యాఖ్యలు వైరల్ అవుతున్నాయి.ఒకప్పుడు ఇన్ని అవమానాలను ఎదుర్కొన్నటువంటి ఈమె ప్రస్తుతం సౌత్ సినిమా ఇండస్ట్రీలోనూ మాత్రమే కాకుండా బాలీవుడ్ ఇండస్ట్రీలో కూడా కెరియర్ పరంగా ఎంతో బిజీగా ఉంటున్నారు.

Related Articles

Stay Connected

0FansLike
0FollowersFollow
0SubscribersSubscribe
- Advertisement -spot_img

Telangana