కోట్లాది మంది తెలుగు ప్రజల అభిమాన కథానాయకుడు మెగాస్టార్ చిరంజీవి (Chiranjeevi) ని కేంద్ర ప్రభుత్వం ఇటీవలే దేశంలోనే రెండో అత్యున్నత పురస్కారమైన పద్మ విభూషణ్ కి ఎంపిక చేసింది. చిరంజీవి కి దక్కిన ఆ గౌరవం పట్ల చిరు ఫ్యాన్స్ తో పాటు రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలు తమ సంతోషాన్ని వ్యక్తం చేసారు. తెలంగాణ ప్రభుత్వం కూడా ఇటీవలే చిరంజీవిని అధికారికంగా సన్మానించింది. ఇప్పుడు ఇదే కోవలో చిరుకి జరిగిన మరో సన్మానం టాక్ అఫ్ ది తెలుగు స్టేట్స్ అయ్యింది.
తెలంగాణ గవర్నర్ పేరు తమిళిసై సౌందరరాజన్(tamilisai soundararajan) ఆమె తాజాగా చిరంజీవిని తన అధికార భవనమైన రాజ్ భవన్ కి పిలిపించుకొని పద్మవిభూషణ్ వచ్చినందుకు కంగ్రాట్స్ తెలిపారు. అలాగే శాలువాతో సన్మానించి బొకే ని కూడా అందచేశారు .చిరంజీవి వెంట ఆయన సతీమణి సురేఖ కూడా రాజ్ భవన్ కి వెళ్ళింది. గవర్నర్ ని కలిసిన ఫొటోస్ ని చిరు సోషల్ మీడియాలో పోస్ట్ చెయ్యడంతో ప్రస్తుతం ఆ పిక్స్ వైరల్ అవుతున్నాయి.
అలాగే తెలంగాణ రాష్ట్ర గవర్నర్ తమిళిసై సత్కరించిన విధానం పట్ల చిరంజీవి తన సంతోషాన్ని వ్యక్తం చేస్తు తన ధన్యవాదాలు చెప్పాడు. ఫ్యాన్స్ అయితే మాత్రం చిరంజీవిని గవర్నర్ సన్మానించిన విధానం పట్ల ఫుల్ ఖుషీతో ఉన్నారు.