Karthik Gattamneni About Ravi Teja Eagle: మాస్ మహారాజా రవితేజ నటించిన కొత్త చిత్రం ఈగల్. ఇందులో రవితేజకు జోడీగా కావ్య థాపర్, అనుపమ పరమేశ్వరన్ హీరోయిన్స్‌గా నటించారు. అలాగే హీరో నవదీప్ కీలక పాత్ర పోషించాడు. ఈగల్ మూవీకి యంగ్ డైరెక్టర్ కార్తీక్ ఘట్టమనేని దర్శకత్వం వహించారు. తెలుగులోని ప్రముఖ నిర్మాణ సంస్థల్లో ఒకటైన పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్‌లో ఈగల్ సినిమాను నిర్మాత టీజీ విశ్వ ప్రసాద్ నిర్మించారు. వివేక్ కూచిభొట్ల సహ నిర్మాతగా వ్యవహరించారు.