ముందుగా బియ్యపు రవ్వను తయారు చేసుకుందాం. దీనికోసం ఒక కప్పు బియ్యం, ఒక టేబుల్ స్పూన్ కందిపప్పు లేదా పెసరపప్పు, ఒక స్పూన్ మిరియాలు, ఒక స్పూన్ జీలకర్ర తీసుకోవాలి. బియ్యాన్ని కడిగి నీళ్లు లేకుండా తీసేయాలి. ఒక గిన్నెలో ఆ బియ్యాన్ని వేసి, బియ్యం తడిగా ఉండగానే మిరియాలు, కందిపప్పు, జీలకర్ర వేసి కలపాలి. దాన్ని నీడలోనే గాలికి ఆరబెట్టుకోవాలి. అవి ఒక గంట లేదా రెండు గంటల తర్వాత పొడిగా మారిపోతాయి. వాటిని మిక్సీలో వేసి రవ్వలా ఆడించాలి. అంతే బియ్యపు రవ్వ రెడీ అయినట్టే. ఇప్పుడు ఈ రవ్వతోనే మనము ఉప్మా చేసుకోవాలి.