TS Gruha Jyothi Scheme : తెలంగాణ ఆర్థిక మంత్రి భట్టి విక్రమార్క ఓటాన్ అకౌంట్ బడ్జెట్(2024-25) శాసనసభలో ప్రవేశపెట్టారు. ఆర్థిక మంత్రి బడ్జెట్ ప్రసంగంలో… తెలంగాణ ప్రజల సంక్షేమమే కాంగ్రెస్ ప్రభుత్వ ధ్యేయమని చెప్పారు. మొత్తం రూ.2,75,891 కోట్లతో ఓటాన్ అకౌంట్ బడ్జెట్ ను ప్రవేశపెట్టినట్లు తెలిపారు. ఎన్నికల తర్వాత కేంద్ర ప్రభుత్వం పూర్తి బడ్జెట్ ప్రవేశపెట్టినప్పుడు రాష్ట్రంలో పూర్తి స్థాయి బడ్జెట్ పెడతామన్నారు. తెలంగాణ ఓటాన్ అకౌంట్ బడ్జెట్(2024- 25) లో రెవెన్యూ వ్యయం -2,01,178 కోట్లు, మూల ధన వ్యయం – 29,669 కోట్లు, ఆరు గ్యారెంటీల కోసం – రూ.53,196 కోట్లుగా అంచనా వేశారు.