వ్యూహం, శపథం రిలీజ్ డేట్‍లు ఇవే..
వ్యూహం సినిమాను ఫిబ్రవరి 23వ తేదీన రిలీజ్ చేయనున్నట్టు ఆర్జీవీ నేడు వెల్లడించారు. 2019 ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు ముందు అప్పటి ప్రతిపక్ష నేత, ప్రస్తుత ముఖ్యమంత్రి వైఎస్ జగన్‍మోహన్ రెడ్డి చేసిన యాత్రలు, ఆయనకు వ్యతిరేకంగా జరిగిన చర్యలను వ్యూహంలో చూపిస్తానని ఆర్జీవీ గతంలోనే చెప్పారు. 2009లో అప్పటి సీఎం వైఎస్ఆర్ మృతి, ఆ తర్వాత ఆయన కుమారుడు వైఎస్ జగన్‍మోహన్ రెడ్డికి ఎదురైన ఇబ్బందులు, ఆయన చేసిన ఓదార్పు యాద్ర, పాదయాత్ర, జైలుకు వెళ్లడం, పార్టీని స్థాపించడం లాంటివి వ్యూహంలో ఉండనున్నాయని ట్రైలర్‌తో తెలిసింది. వైఎస్ జగన్ పాత్రలో అజ్మల్ నటించారు.