Home ఎంటర్టైన్మెంట్ ఈగల్ ఫస్ట్ డే కలెక్షన్స్..రవితేజ స్టామినా ఇదే 

ఈగల్ ఫస్ట్ డే కలెక్షన్స్..రవితేజ స్టామినా ఇదే 

0

మాస్ మహారాజ  రవితేజ(ravi teja) నుండి వచ్చిన లేటెస్ట్ మిస్సైల్ ఈగల్ (eagle).విడుదలైన అన్ని చోట్ల పాజిటివ్ టాక్ తో ముందుకు దూసుకుపోతుంది. రవి తేజ నటనకి అన్ని వర్గాల  ప్రేక్షకుల నుంచి మంచి స్పందన వస్తుంది.మంచి పాయింట్ తో తెరకెక్కిందనే కితాబుని కూడా అందుకుంటున్న   ఈగల్ మొదటి రోజు  కలెక్షన్స్ అందరిని ఆశ్చర్యానికి గురి చేస్తున్నాయి.

ఈగల్ మొదటి రోజు వరల్డ్ వైడ్ గా  11.90 కోట్ల గ్రాస్ ని సాధించింది. దీంతో  రవితేజ కెరీర్ లోనే హయ్యెస్ట్ గ్రాస్ సాధించిన  మరో బిగ్గెస్ట్ ఓపెనర్ గా ఈగల్  నిలిచింది.ఇప్పడు ఈ కలెక్షన్స్ తో మాస్ మహారాజ్ కి తెలుగు నాట ఉన్న క్రేజ్ మరో సారి అర్ధం అయ్యింది. వీకెండ్ లో  ఈగల్ మరిన్ని రికార్డు కలెక్షన్ లు  రాబడుతుందని  మేకర్స్ భావిస్తున్నారు.రవి తేజ ఫ్యాన్స్ మాత్రం సినిమా చూసి చాలా హ్యాపీగా ఉన్నారు.

 పీపుల్ మీడియా ఫ్యాక్టరీ పతాకంపై  80   కోట్ల బడ్జట్ తో నిర్మాణం జరుపుకున్న ఈగల్ లో రవితేజ సరసన  కావ్య థాపర్  జతగట్టగా  మరో హీరోయిన్ అనుపమ పరమేశ్వరన్ ముఖ్య పాత్రలో నటించింది. కార్తీక్ ఘట్టమనేని దర్శకత్వ ప్రతిభ ప్రతి ఒక్కరిని ఆకట్టుకుంటుంది.అలాగే మూవీ హాలీవుడ్ స్థాయిలో ఉందనే కితాబుని కూడా అందుకుంది. డేవ్ జాండ్ బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ సినిమాని ఇంకో లెవల్ కి తీసుకెళ్లింది.

 

Exit mobile version