Friday, January 24, 2025

మహేష్ బాబు  కూతురు సితార పేరిట డబ్బులు వసూలు

సూపర్ స్టార్ మహేష్ బాబు ముద్దుల తనయ సితార (sitara)ఘట్టమనేని గురించి ఇప్పుడు తెలుగుదేశంలో తెలియని వారు లేరు.చిన్న వయసులోనే ఒక బిగ్ సెలబ్రిటీ గా మారి ఎన్నో మెగా సంస్థలకి బ్రాండ్ అంబాసిడర్ గా  పని చేస్తుంది.  సోషల్ మీడియాలో ఎప్పుడు యాక్టీవ్ గా ఉంటు తన వీడియోస్ ని షేర్ చేస్తు తన కంటు సొంతంగా అభిమానులని కూడా సంపాదించుకుంది. ఇనిస్టాగ్రమ్ లో  2 మిలియన్ల ఫాలోవర్స్ ఉన్నారంటే  తన ఫ్యాన్ బేస్ ని అర్ధం చేసుకోవచ్చు. తాజాగా సితార కి సంబంధించిన  న్యూస్ ఒకటి ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాల్లో హాట్ టాపిక్ అయ్యింది.

కొంత మంది సైబర్ నేరగాళ్లు సితార ఘట్టమనేని పేరిట ఇనిస్టాగ్రమ్ లో ఒక ఫేక్ అకౌంట్ ని ఓపెన్ చేసారు. ఆ తర్వాత. సితార పేరిట మోసపూరిత ట్రేడింగ్, ఇన్వెస్ట్మెంట్ లింక్ లను పలువురు నెటిజన్స్ కి పంపుతున్నారు. సితార పంపించింది కదా అని  లింక్ ఓపెన్ ఓపెన్ చేస్తున్నారు.వెంటనే సైబర్ నేరగాళ్లు టెక్నాలజీ ని ఉపయోగించి నెటిజన్స్ బ్యాంకు అకౌంట్ నుంచి డబ్బులు కాజేస్తున్నారు. దీంతో  జరుగుతున్న మోసాన్ని  గుర్తించిన మహేష్ బాబు టీం (జిఎంబి ) సైబరాబాద్ పోలీసులకు ఫిర్యాదు చేసింది.పూర్తి వివరాలు సేకరించిన పోలీసులు  త్వరలోనే  సైబర్ నేరగాళ్ళను పట్టుకుంటామని  తెలిపారు.

 

సితార ఘట్టమనేని పేరుతో సోషల్ మీడియాలో  వచ్చే ఎలాంటి  అనుమానాస్పద నోటిఫికేషన్స్ కు గాని  రిక్వెస్టులకు గాని ఎవరు  స్పందించవద్దని మహేష్ (mahesh)టీమ్ అభిమానులని కోరింది. ఈ మేరకు సైబరాబాద్ పోలీసులతో కలిసి మహేష్ జిఎం బి సంస్థ ఒక ప్రెస్ నోట్ ని కూడా  రిలీజ్ చేసింది. సైబర్ నేరగాళ్లు  మహేష్ బాబు కుటుంబాన్ని టార్గెట్ చెయ్యడం తాజాగా చర్చినీయాంశమయ్యింది. మోసానికి ఎలాంటి క్వాలిఫికేషన్ లేదు కాబట్టి  ఎవరు పడితే వాళ్ళు  సెలబ్రిటీ ల పేరిట  అకౌంట్స్ ఓపెన్ చేసి మీ కష్టాన్ని దోచుకుంటున్నారు తస్మాత్ జాగ్రత్త.

 

Related Articles

Stay Connected

0FansLike
0FollowersFollow
0SubscribersSubscribe
- Advertisement -spot_img

Telangana