Monday, February 3, 2025

పార్లమెంటు ఎన్నికలకు వారసత్వ రాజకీయాలు- ఎంపీ టికెట్ల కోసం నేతల కుటుంబ సభ్యులు పోటీ-nalgonda news in telugu congress brs leaders family members in first row for mp tickets ,తెలంగాణ న్యూస్

Loksabha MP Tickets : పార్లమెంటు ఎన్నికలకు ముహూర్తం ముంచుకొస్తోంది. అదే తరుణంలో ఆయా రాజకీయ పార్టీలో హడావిడి కూడా మొదలైంది. ముఖ్యంగా ఈసారి పార్లమెంటు ఎన్నికలు కుటుంబ వారసత్వ రాజకీయాలకు వేదికగా మారనున్నాయా అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఎంపీ టికెట్ల కోసం ఆయా నేతల కుటుంబ సభ్యులు పోటీ పడుతుండడం చర్చనీయాంశంగా మారింది. గతేడాది జరిగిన తెలంగాణ శాసనసభ ఎన్నికల్లో రాష్ట్రంలో అధికార మార్పిడి జరిగి కాంగ్రెస్ పాలన పగ్గాలు చేపట్టాక.. ఆ పార్టీ నుంచి రానున్న లోక్ సభ ఎన్నికల్లో పోటీ చేయడానికి డిమాండ్ పెరిగింది. మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో ఒకే కుటుంబం నుంచి ఎమ్మెల్యేలుగా పోటీ చేసిన నాయకులు ఉండగా, ఉమ్మడి మెదక్ జిల్లా నుంచి మైనంపల్లి హన్మంతరావు, ఆయన తనయుడు పోటీ చేయగా, హన్మంతరావు ఓటమిపాలయ్యారు. ఉమ్మడి నల్గొండ జిల్లా నుంచి ఎన్.ఉత్తమ్ కుమార్ రెడ్డి, ఆయన భార్య పద్మావతి రెడ్డి పోటీ చేయగా ఇద్దరూ విజయం సాధించారు. ఇదే జిల్లాకు చెందిన కోమటిరెడ్డి సోదరులు వెంకటరెడ్డి, రాజగోపాల్ రెడ్డి ఇద్దరూ పోటీచేసి విజయాలు సాధించారు. ఇక, గత ఎన్నికల్లో టికెట్ దక్కని వారు, లేదా కుటుంబలో ఒకరికే అవకాశం వచ్చిన వారు లోక్ సభ ఎన్నికల్లో టికెట్లు అడుగుతున్నారు.

Related Articles

Stay Connected

0FansLike
0FollowersFollow
0SubscribersSubscribe
- Advertisement -spot_img

Telangana