ఆయన హీరోగా 23 సినిమాలకి పైగానే చేసాడు. క్రియేటివిటీ దర్శకులుగా పేరు మోసిన వెట్రి మారన్ విజయ్, అట్లీ లాంటి దర్శకులతో కలిసి వర్క్ చేసాడు.అలాగే ప్రెజెంట్ ఇండియాలో ఉన్న బెస్ట్ మ్యూజిక్ డైరెక్టర్ లలో కూడా ఆయన ఒకడు. తాజాగా ఆయన చెప్పిన ఒక విషయం ఇప్పుడు ఇండియన్ సినిమా ఇండస్ట్రీలోనే హాట్ టాపిక్ గా నిలిచింది.
తమిళ చిత్ర పరిశ్రమలో చిన్న వయసునుంచే సినిమాల్లో నటిస్తు అలాగే సంగీత దర్శకుడుగా ఎన్నో అధ్బుతమైన పాటలని అందించిన సంగీత కెరటం జివి ప్రకాష్ కుమార్. తాజాగా ఆయన సినిమా రంగంలోని ప్రతిభని ప్రోత్సహించడానికి ఏర్పడిన స్టార్డా కార్యక్రమంలో పాల్గొన్నాడు. ఆ కార్యక్రమంలో ఆయన చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు టాక్ అఫ్ ది డే గా నిలిచాయి. కొన్ని వ్యాపార సంస్థలు జివి ప్రకాష్ కుమార్ ని జూదం ఆడటానికి ప్రోత్సహించేలా చేసే యాడ్స్ లోను శీతల పానీయాల ప్రకటనల్లోను నటించమని అడిగారు. అలా నటిస్తే కోట్ల రూపాయిల డబ్బులు ఇస్తామని ఆఫర్ చేసారు. కానీ తనవల్ల ఎవరు జీవితాల్ని ఆరోగ్యాలని నాశనం చేసుకోకూడదని ఆయన అందుకు అంగీకరించలేదు.ఈ విషయాన్ని స్టార్డా కార్యక్రమంలో ప్రకాష్ చెప్పాడు.సోషల్ మీడియాలో ఆయన వ్యాఖ్యలని చూస్తున్న పబ్లిక్ అంతా కూడా సమాజం పట్ల జివిప్రకాష్ కుమార్ కి ఉన్న బాధ్యతని మెచ్చుకుంటున్నారు.
స్టార్డా జి వి ప్రకాష్ కుమార్ ని తమ బ్రాండ్ అంబాసిడర్ గా ఎంచుకుంది.ఇండస్ట్రీ లో టాలెంట్ ఉన్న వాళ్ళు చాలా మంది ఉన్నారని కానీ వాళ్ళకి తమ టాలెంట్ ని ప్రదర్శించడానికి సరైన మార్గం తెలియదని ఇప్పుడు వాళ్లందరికీ స్టార్డా మంచి ప్లాట్ ఫామ్ అవుతుందని ప్రకాష్ కుమార్ చెప్పాడు.అలాగే అలాంటి సంస్థకి బ్రాండ్ అంబాసిడర్ గా ఉన్నందుకు కూడా చాలా ఆనందంగా ఉందని ఆయన చెప్పాడు. ఆయన సంగీతంలో వచ్చిన ఎన్నో సినిమాలు అందించిన పాటలు బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ వలన మరింత సక్సెస్ అయ్యాయి.