Home తెలంగాణ కేబినెట్ విస్తరణ… నల్గొండకు మరో మంత్రి పదవి సాధ్యమేనా..?-will there be another chance in...

కేబినెట్ విస్తరణ… నల్గొండకు మరో మంత్రి పదవి సాధ్యమేనా..?-will there be another chance in nalgonda district in telangana cabinet expansion ,తెలంగాణ న్యూస్

0

కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డిలో ఎందుకంత ధీమా..?

అసెంబ్లీ ఎన్నికల సమావేశాల తర్వాత మంత్రి వర్గ విస్తరణ జరుగుతుందని, తనకు మంత్రి పదవి వస్తుందని కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఎందుకంత ధీమా వ్యక్తం చేస్తున్నారు. చివరకు తనకు తానే మంత్రిత్వ శాఖను సైతం ఖరారు చేసుకున్నారు. ఏఐసీసీ నాయకత్వం నుంచి తనకు స్పష్టమైన హామీ ఉందంటూ ప్రకటిస్తున్నారు. మునుగోడు ఉప ఎన్నికల సయమంలో కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి బీజేపీ నాయకునిగా కాంగ్రెస్ పై పెద్ద విమర్శలే చేశారు. టీపీసీసీ అధ్యక్షుడు, సీఎం రేవంత్ రెడ్డి పై ఘాటైన విమర్శలు గుప్పించారు. ఒక విధంగా రేవంత్ రెడ్డి, కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి మధ్య మాటల యుద్దం నడిచింది. కానీ, తీరా సాధారణ ఎన్నికల సమయానికి రాజగోపాల్ రెడ్డి బీజేపీని వీడి కాంగ్రెస్ గూటికి చేరారు. రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారం చేపట్టింది. రేవంత్ రెడ్డి సీఎం అయ్యారు. కానీ, ఈ ఇద్దరి నాయకుల మధ్య ఇంకా సయోధ్య కుదరలేదని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. ఇప్పటి దాకా సీఎం రేవంత్ రెడ్డితో రాజగోపాల్ రెడ్డి భేటీ అయిన సందర్భం కూడా లేకపోవడాన్ని ప్రస్తావించాల్సిందే.

Exit mobile version