తెలంగాణలో మార్పు అంటే నంబర్ ప్లేట్లు మార్చడం కాదు.. ప్రజల జీవితాల్లో మార్పు తీసుకురావాలని ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డి విమర్శించారు. రాష్ట్రాన్ని ఎవ్వరు ఇవ్వలేదని, కొట్లాడి తెచ్చుకున్నామని అన్నారు. రెండో రోజు అసెంబ్లీ సమావేశాల ప్రారంభంలోనే వాడివేడి చర్చ మెుదలైంది. గవర్నర్ ప్రసంగంపై కాంగ్రెస్, బీఆర్ఎస్ నేతల మధ్య మాటల యుద్ధం జరిగింది. ఈ సందర్భంగా పల్లా.. ఆటో డ్రైవర్లు, ఉచిత బస్సు ప్రయాణంపై మాట్లాడారు.