ఉత్తరాఖండ్ రాష్ట్రం నైనిటాల్ జిల్లా హల్ద్వానీలో భారీ హింస చెలరేగింది. ఈ హింస కారణంగా నగరంలో తీవ్ర ఉద్రిక్తత వాతావరణం నెలకొంది. అయితే ఈ హింసకు ప్రధాన కారణం.. హైకోర్టు ఆదేశాల మేరకు హల్ద్వానీలోని వివిధ ప్రాంతాల్లో అక్రమంగా నిర్మించిన మదర్సాలను కూల్చి వేస్తున్నారు. పోలీసులు పర్యవేక్షణలో చర్యలు చేపట్టారు. ఈ క్రమంలో బుల్డోజర్లతో వెళ్లిన ప్రభుత్వ అధికారులపై వన్‌బుల్‌పురా ప్రాంతంలోని ప్రజలు రాళ్లతో విసిరారు. అక్కడ ఉన్న వాహనాలకు నిప్పు పెట్టారు. ఈ హింసలో నలుగురు మృతి చెందగా, 250 మంది గాయపడ్డారు.