PV Narasimha Rao Bharat Ratna : “మాజీ ప్రధాని శ్రీ నరసింహ రావు గారికి భారత రత్న ఇస్తున్నట్టు ప్రకటించడం చాలా సంతోషంగా ఉంది. ఆయన ఓ గొప్ప రాజకీయవేత్త. అనేక మార్గాల్లో దేశానికి సేవ చేశారు. ఆంధ్రప్రదేశ్ సీఎంగాను ఆయన చాలా గొప్పగా బాధ్యతలు నిర్వర్తించారు. కేంద్ర మంత్రి, ఎంపీ, శాసనసభల్లో ఎన్నో ఏళ్ల పాటు ఆయన చేసిన కృషిని ఎవరు మర్చిపోలేరు. విజన్ ఉన్న గొప్ప నాయకుడు నరసింహ రావు. దేశ ప్రగతికి, వృద్ధికి ఆయన పునాది వేశారు,” అని ప్రధాని మోదీ ట్వీట్ చేశారు.