48 శాతం విద్యార్థినులు
రిలయన్స్ ఫౌండేషన్ ఇప్పటివరకు 23,136 మంది విద్యార్థులకు స్కాలర్‌షిప్‌లను ప్రదానం చేసింది, ఇందులో 48 శాతం విద్యార్థినులు ఉన్నారు. ఇంకా 3,001 మంది దివ్యాంగులైన విద్యార్థులు ఉన్నారు. స్కాలర్‌షిప్ ప్రోగ్రామ్‌లో కామర్స్, ఆర్ట్స్, బిజినెస్/మేనేజ్‌మెంట్, కంప్యూటర్ అప్లికేషన్స్, సైన్స్, మెడిసిన్, లా, ఎడ్యుకేషన్, ఇంజినీరింగ్/టెక్నాలజీ, UG డిగ్రీల విద్యార్థులు ఉంటారు. రిలయన్స్ ఫౌండేషన్ UG స్కాలర్‌షిప్‌లు 2023-24 ఫలితాలను చెక్ చేయడానికి, అభ్యర్థులు అధికారిక వెబ్‌సైట్- www.reliancefoundation.org ని సందర్శించాలి.