ప్రేమికుల రోజు దగ్గరకు వస్తుంది. అయితే సోషల్ మీడియాలో కొన్ని విషయాలు ట్రెండ్ అవుతూ ఉంటాయి. మీ భాగస్వామిది నిజమైన ప్రేమ అని తెలుసుకునేందుకు నారింజ తొక్క సిద్ధాంతమని ఒకటి వైరల్ అవుతోంది. నిజానికి భార్యాభర్తల అనుబంధం అంటేనే ప్రేమ, కోపం, గొడవలు ఇలా అన్నీ కలగలిసి ఉంటాయి. కానీ ఒకరినొకరు తెలుసుకోవడం జీవితం యొక్క ముఖ్య ఉద్దేశం. పరస్పర ప్రేమ, విశ్వాసం ఆ సంబంధానికి మూలం. ఎక్కడ ప్రేమ ఎక్కువగా ఉంటుందో ఆ సంబంధం శాశ్వతం. ఇది ఇతరులకు ఆదర్శంగా నిలుస్తుంది.