Wednesday, January 8, 2025

అంత డబ్బు ఇస్తేనే ‘జైహనుమాన్‌’ చేస్తాను.. లేకపోతే లేదు.. పుకార్లకు చెక్‌ పెట్టిన వర్మ!

ఒక సినిమా పెద్ద హిట్‌ అయ్యిందంటే ఆ యూనిట్‌ ఎంతో సంతోషిస్తుంది. అది సర్వసాధారణం. ఆ యూనిట్‌ను ఎంతో మంది అభినందిస్తారు. ఇంత పెద్ద హిట్‌ అయినందుకు తమకెంతో సంతోషంగా ఉందని పబ్లిక్‌గానే ప్రకటిస్తారు. అయితే ఇందులో ఎంతమంది జెన్యూన్‌గా ఈ విషయాన్ని ఒప్పుకుంటారు. ఎదుటివారి సినిమా విజయం సాధించింది అంటే సంతోషించేవారు ఎంత మంది? కొందరు నిజాయితీగానే అభినందించినా, మరికొందరు పైకి నవ్వుతూ అభినందించినా లోలోపల అసూయా ద్వేషాలను పెంచుకుంటారు. ఇది కూడా సర్వసాధారణమే. అయితే మరికొందరు మాత్రం సినిమా ప్రారంభం నుంచి రిలీజ్‌ అయ్యే వరకు ఎంతో కలిసి మెలిసి పనిచేసిన యూనిట్‌ సభ్యుల మధ్య గొడవలు పెట్టాలని చూస్తారు, వారిని వీలైనంత బ్యాడ్‌ చెయ్యాలని ప్రయత్నిస్తారు. దానివల్ల వారికి ఒరిగేదేమీ లేకపోయినా తమ అక్కసును ఆ విధంగా వ్యక్తపరుస్తుంటారు. ఇలాంటిదే ‘హనుమాన్‌’ విషయంలో జరిగింది.

వివరాల్లోకి వెళితే.. ఈ ఏడాది సంక్రాంతికి యునానిమస్‌ హిట్‌గా నిలిచిన చిత్రం ‘హనుమాన్‌’. తక్కువ బడ్జెట్‌తో నిర్మించిన ఈ సినిమా వరల్డ్‌వైడ్‌గా రూ.300 కోట్లు కలెక్ట్‌ చేసింది. ప్రశాంత్‌వర్మ దర్శకత్వంలో నిరంజన్‌రెడ్డి ఈ చిత్రాన్ని నిర్మించారు. ఈ సినిమా సందడి ముగిసిన తర్వాత ఇప్పుడు మరో కొత్త న్యూస్‌ సోషల్‌ మీడియాలో చక్కర్లు కొడుతోంది. అదేమిటంటే ‘హనుమాన్‌’ సాధించిన భారీ కలెక్షన్స్‌ దర్శకనిర్మాతల మధ్య గొడవలకు కారణమైందన్నది ఆ న్యూస్‌. ఈ సినిమాకి వచ్చిన లాభాల్లో తనకు వాటాగా రూ.30 కోట్లు ఇవ్వాలని డైరెక్టర్‌ ప్రశాంత్‌ వర్మ డిమాండ్‌ చేస్తున్నాడని, ఈ విషయంలో నిర్మాత నిరంజన్‌రెడ్డి ఒత్తిడి తీసుకొస్తున్నాడని ప్రచారం జరుగుతోంది. ఇదే కాదు, ఈ సినిమాకి సీక్వెల్‌గా ‘జై హనుమాన్‌’కి సంబంధించి కొంత అడ్వాన్స్‌ ఇవ్వాలని, లాభాల్లో వాటా కావాలని ముందే అడుగుతున్నాడని చెప్పుకుంటున్నారు. తన షరతులు ఒప్పుకోకపోతే సీక్వెల్‌ కోసం తాను పనిచేయనని ప్రశాంత్‌వర్మ చెప్పినట్టు ప్రచారం జరుగుతోంది. 

ఇదిలా ఉంటే.. తాజాగా డైరెక్టర్‌ ప్రశాంత్‌ వర్మ తన ఎక్స్‌ పేజీలో నిర్మాత నిరంజన్‌రెడ్డితో కలిసి దిగిన ఫోటోను షేర్‌ చేశారు. ఇద్దరూ ఒకే ఫ్రేమ్‌లో ఫోన్‌ చూసుకుంటూ నవ్వుకుంటున్నారు. ఈ ఫోటోను షేర్‌ చేస్తూ తమపై వస్తున్న నెగెటివిటీని తీసిపారేస్తూ నవ్వుకుంటున్నట్టు రాసుకొచ్చాడు. తాము హనుమాన్‌ స్పిరిట్‌ని కొనసాగిస్తున్నామని తెలిపారు. ప్రశాంత్‌వర్మ పెట్టిన ఒక్క పోస్ట్‌ వల్ల తమ మధ్య గొడవలు ఉన్నాయని వస్తున్న రూమర్స్‌కి ప్రశాంత్‌వర్మ చెక్‌ పెట్టాడని నెటిజన్లు తమ సతోషాన్ని వ్యక్తం చేస్తున్నారు.

Related Articles

Stay Connected

0FansLike
0FollowersFollow
0SubscribersSubscribe
- Advertisement -spot_img

Telangana