Bhamakalapam 2 OTT Trailer Date: ప్రియమణి ప్రధాన పాత్రలో నటిస్తున్న ‘భామాకలాపం 2’ చిత్రంపై మంచి ఆసక్తి నెలకొంది. ఇటీవల టీజర్‌తో ఈ చిత్రంపై బజ్ పెరిగింది. ఆహా ఓటీటీ ప్లాట్ఫామ్లో ఈ సినిమా నేరుగా అడుగుపెట్టనుంది. 2022లో వచ్చిన భామాకలాపం చిత్రానికి సీక్వెల్‌గా ఇది వస్తోంది. ‘భామాకలాపం 2’ స్ట్రీమింగ్ డేట్ కూడా ఖరారైంది. ఇప్పుడు ట్రైలర్ కూడా రెడీ అయింది. ఈ సినిమా ట్రైలర్ రిలీజ్ డేట్, టైమ్‌ను ఆహా వెల్లడించింది.