Sunday, October 20, 2024

ప్రేమలో ఓడిపోతే జీవితమే లేనట్టు కాదు, ప్రేమలోఓడినా భవిష్యత్తులో గెలిచిన వారెందరో-friday motivation if you lose in love it is not like there is no life you will win in the future ,లైఫ్‌స్టైల్ న్యూస్

Friday Motivation: ప్రేమంటే యువతీ యువకుల మధ్య పుట్టేదే.. అని ఎవరు చెప్పారు? ఏ రాజ్యాంగంలో రాసుంది? మన మహా మత గ్రంధాలైన రామాయణం, మహాభారతం, ఖురాన్, బైబిల్… ఎందులోని కూడా ప్రేమ ఇద్దరి యువతీ యువకుల మధ్య పుట్టేది మాత్రమే అని వివరించలేదు. ఎవరి మధ్యనైనా ప్రేమ పుట్టొచ్చు. తల్లిదండ్రులు బిడ్డ మీద చూపించేది ప్రేమే. బిడ్డ తల్లిదండ్రుల నుంచి కోరుకునేది ప్రేమే. చివరికి ఇంట్లో మనం పెంచుకునే కుక్కపిల్లలు, పిల్లి పిల్లలపై కూడా మనం చూపించేది ప్రేమే. అంతే కానీ యువతీ యువకులు మధ్య ఉన్నది మాత్రమే ప్రేమ అనుకుంటే పొరపాటే. ఆ ప్రేమ ఓడితే చాలు కొంతమంది ఉన్మాదులుగా మారి తమని తామే చంపుకుంటున్నారు. కొంతమంది ఎదుటివారిని కర్కశంగా చంపేస్తున్నారు. ప్రేమలో ఓడితే జీవితంలో ఓడినట్టు కాదు. ప్రేమలో ఓడితే జీవితంలోని ఒకే ఒక మలుపులో మాత్రమే మీరు వెనకడుగు వేసినట్టు, అలాంటి మలుపులు జీవితంలో ఎన్నో ఎదురవుతాయి. ప్రతి మలుపు మీ గెలుపు కోసం ఎదురుచూస్తూ ఉంటుంది. కానీ ప్రేమ అనే మలుపు దగ్గరే మీరు ఆగిపోతే… మిగతా గెలుపులను దాటుకుంటూ ఎలా ముందుకు వెళతారు.

Related Articles

Stay Connected

0FansLike
0FollowersFollow
0SubscribersSubscribe
- Advertisement -spot_img

Telangana