Home బిజినెస్ గత సంవత్సరం పాకిస్తాన్ లో అమ్ముడుపోయిన కార్ల సంఖ్య ఎంత తక్కువో తెలుసా..?-how many cars...

గత సంవత్సరం పాకిస్తాన్ లో అమ్ముడుపోయిన కార్ల సంఖ్య ఎంత తక్కువో తెలుసా..?-how many cars were sold in pakistan in 2023 figures likely to shock you ,బిజినెస్ న్యూస్

0

30 వేల కార్లు మాత్రమే..

పాకిస్తాన్ ఆటోమోటివ్ మాన్యుఫ్యాక్చరర్స్ అసోసియేషన్ (PAMA) వెల్లడించిన తాజా సమాచారం ప్రకారం, 2023లో పాకిస్తాన్ లో అమ్ముడయిన మొత్తం కార్ల సంఖ్య 30,662 మాత్రమే. 1,000 cc లోపు ఉన్న సెగ్మెంట్‌లో గరిష్టంగా 14,584 యూనిట్ల వాహనాలు అమ్ముడయ్యాయి. సుజుకీ బోలాన్ (ఓమ్ని వ్యాన్), ఆల్టో వంటి మోడల్‌ల లో మాత్రమే కొంత సేల్స్ జరిగాయి. 1,000 cc సెగ్మెంట్‌లో, సుజుకీ కల్టస్ (సెలెరియో), వ్యాగన్ఆర్ వంటి మోడళ్లు కొంత ఎక్కువగా సేల్ అయ్యాయి. గతేడాది మొత్తంగా ఈ విభాగంలో 3,737 యూనిట్లు అమ్ముడయ్యాయి. మరియు 1,300 cc ప్లస్ విభాగంలో, హోండా సిటీ, హోండా సివిక్, సుజుకి స్విఫ్ట్, టయోటా కరోలా, టయోటా యారిస్ వంటి మోడల్స్ 12,341 యూనిట్లు అమ్ముడయ్యాయి. 2022 తో అమ్ముడయిన కార్లతో పోలిస్తే, 2023 లో సగానికన్నా తక్కువ కార్లు అమ్ముడయ్యాయి. 2022 లో మొత్తం 68,912 యూనిట్ల కార్లు అమ్ముడయ్యాయి.

Exit mobile version