అయితే సంక్రాంతికి తెలుగు రాష్ట్రాల్లో కూడా ఆయలాన్ సినిమాను విడుదల చేద్దామనుకున్నారు. కానీ, ఇక్కడే మహేశ్ బాబు గుంటూరు కారం, వెంకటేష్ సైంధవ్, నాగార్జున నా సామిరంగ, తేజ సజ్జ హనుమాన్ సినిమాలు సంక్రాంతి బరిలో నిలిచాయి. దీంతో ఆయాలన్ మూవీతోపాటు ధనుష్ కెప్టెన్ మిల్లర్ సినిమాలు ఇక్కడ రిలీజ్ ఆపేశాయి. అనంతరం రిపబ్లిక్ డే సందర్భంగా జనవరి 26న ఆయలాన్ సినిమాను తెలుగులో రిలీజ్ చేద్దామనుకున్నారు. కానీ, అనుకోని కారణాల వల్ల అప్పుడు కూడా ఆయలాన్ తెలుగు వెర్షన్ రిలీజ్ ఆగిపోయింది.