ప్రస్తుతం సాయిపల్లవి, అనుపమ పరమేశ్వరన్ టాలీవుడ్‌లో టాప్ హీరోయిన్లుగా కొనసాగుతోన్నారు. నివీన్ పాల్ కూడా ప్రేమమ్ మూవీతోనే అగ్ర హీరోలు లిస్ట్‌లో అడుగుపెట్టాడు. ప్రేమమ్ మూవీని తెలుగులో అదే పేరుతో రీమేక్ చేశారు. ఈ రీమేక్‌లో నాగచైతన్య హీరోగా నటించాడు. చందు ముండేటి దర్శకత్వం వహించారు. మలయాళ మాతృకలో నటించిన అనుపమ పరమేశ్వరన్, మడోన్నా సెబాస్టియన్ తెలుగులో రీమేక్‌లో హీరోయిన్లుగా కనిపించారు. కానీ సాయిపల్లవి పాత్రను మాత్రం తెలుగులో శృతిహాసన్ చేసింది. తెలుగులో కూడా ప్రేమమ్ మూవీ కమర్షియల్ సక్సెస్‌గా నిలిచింది.