తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై బీఆర్ఎస్ నేత, మాజీ ఎమ్మెల్యే బాల్కసుమన్ తీవ్ర పదజాలం ఉపయోగించారు. చొప్పు చూపిస్తూ సంస్కారం అడ్డు వస్తుందన్నారు. ప్రాణత్యాగం వరకు వెళ్లి తెలంగాణను సాధించిన గొప్ప మహనీయుడు కేసీఆర్ అని, అలాంటి వ్యక్తిని పట్టుకుని రేవంత్ రెడ్డి నోటికోచ్చినట్లు దుర్భాషాలాడటం సిగ్గుచేటని అన్నారు. కేసీఆర్ ను మరోసారి ఏమైన అంటే లక్షమందితో వచ్చి పండబెట్టి తొక్కిపడేస్తామన్నారు.