ఢిల్లీ రైల్వే స్టేషన్ లో..
ఇటీవల జమ్ముకశ్మీర్ లోని దర్యాప్తు సంస్థలు ఒక ఉగ్రవాద కుట్రను చేధించారు. ఆ సందర్భంగా ఐదుగురిని అరెస్ట్ చేసి, వారి వద్ద నుంచి ఐదు ఏకే రైఫిల్స్ (షార్ట్), ఐదు ఏకే మ్యాగజైన్లు, 16 షార్ట్ ఏకే రౌండ్లు స్వాధీనం చేసుకున్నారు. వారి వద్ద నుంచి వచ్చిన సమాచార ప్రకారం లష్కరే తోయిబాలో రియాజ్ అహ్మద్ రాథర్ క్రియాశీలకంగా వ్యవహరిస్తున్నట్లు తేలింది. దాంతో, వారు వెంటనే ఢిల్లీలోని ఇంటలిజెన్స్ వర్గాలకు సమాచారం అందించారు. వారికి, రియాజ్ పరారీలో ఉన్నాడని తెలిసింది. అలాగే, అతడు మంగళవారం తెల్లవారు జామున న్యూఢిల్లీ రైల్వే స్టేషన్ కు వస్తాడని కూడా సమాచారం అందింది. దాంతో, న్యూ ఢిల్లీ రైల్వే స్టేషన్ లో ఒక బృందాన్ని ఏర్పాటు చేసి మోహరించారు. తెల్లవారుజామున ఎగ్జిట్ గేట్ నంబర్-1 నుంచి పారిపోయేందుకు యత్నిస్తుండగా రియాజ్ ను గుర్తించి అదుపులోకి తీసుకున్నారు.