కుల వివక్ష బ్యాక్‌డ్రాప్‌లో…
అంబాజీపేట మ్యారేజి బ్యాండు మూవీతో దుష్యంత్ కటికనేని దర్శకుడిగా టాలీవుడ్లోకి ఎంట్రీ ఇచ్చాడు. కులవివక్షకు లవ్ స్టోరీ, ఫ్యామిలీ ఎమోషన్స్ జోడించి ఈ మూవీని తెరకెక్కించాడు. ఇందులో మల్లి అనే నిమ్న వర్గానికి చెందిన యువకుడిగా సుహాన్ నటనకు ప్రశంసలు దక్కుతున్నాయి. మల్లి (సుహాస్) అంబాజిపేట మ్యారేజి బ్యాండులో సభ్యుడిగా పనిచేస్తుంటాడు. అతడి కవల సోదరి పద్మ (శరణ్య ప్రదీప్) ఊరిలో స్కూల్ టీచర్‌గా పనిచేస్తుంటుంది.