మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా స్టార్ డైరెక్టర్ శంకర్ దర్శకత్వంలో రూపొందుతోన్న చిత్రం ‘గేమ్ ఛేంజర్’. శ్రీవెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై దిల్ రాజు భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్న ఈ సినిమాలో కియారా అద్వానీ హీరోయిన్. రామ్ చరణ్, శంకర్ కాంబినేషన్ లో వస్తున్న మొదటి సినిమా కావడంతో ‘గేమ్ ఛేంజర్’పై భారీ అంచనాలు ఉన్నాయి. ఈ సినిమా కోసం ఫ్యాన్స్ ఎంతగానో ఎదురుచూస్తున్నారు. అయితే కొంత షూట్ పూర్తయ్యాక దర్శకుడు శంకర్ ‘ఇండియన్-2’తో బిజీ కావడంతో.. ‘గేమ్ ఛేంజర్’ షూటింగ్ ఆలస్యమవుతూ వస్తోంది. ఇంకా 30 శాతానికి పైగా షూటింగ్ చేయాల్సి ఉంది అంటున్నారు. అయితే ఇప్పుడు ఈ సినిమాకి సంబంధించి ఫ్యాన్స్ కి ఓ గుడ్ న్యూస్ వినిపిస్తోంది.
రామ్ చరణ్ తన తదుపరి సినిమాని బుచ్చిబాబు డైరెక్షన్ లో చేయనున్న సంగతి తెలిసిందే. ఓ వైపు ఆ మూవీ షూట్ చేస్తూనే.. మరోవైపు ‘గేమ్ ఛేంజర్’ బ్యాలెన్స్ షూట్ ని కూడా వీలైనంత త్వరగా పూర్తి చేయాలని చూస్తున్నాడట చరణ్. త్వరలోనే ఒక కీలక షెడ్యూల్ ని ప్రారంభించాలని ‘గేమ్ ఛేంజర్’ మూవీ టీం ప్లాన్ చేస్తోందట. జూన్ నాటికి చరణ్ కి సంబంధించిన షూటింగ్ పోర్షన్ మొత్తం కంప్లీట్ అవుతుందట. జూలై నాటికి సినిమాకి సంబంధించిన మొత్తం షూటింగ్ పూర్తవుతుందని తెలుస్తోంది. పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ త్వరగా పూర్తయితే.. దసరా కానుకగా అక్టోబర్ లో విడుదల చేయాలని, లేదంటే డిసెంబర్ లో రిలీజ్ చేయడానికి మేకర్స్ సన్నాహాలు చేస్తున్నట్లు సమాచారం.