రొయ్యలు తినడం వల్ల మన ఆరోగ్యానికి అవసరమైన విటమిన్ బి12 పుష్కలంగా దొరుకుతుంది. విటమిన్ బి12 లోపిస్తే శరీరంలో ఎన్నో సమస్యలు వస్తాయి. ముఖ్యంగా డిప్రెషన్, బలహీనత, తీవ్రమైన అలసట వంటివి రావచ్చు. కాబట్టి రొయ్యలను తరచూ తినడం అలవాటు చేసుకోవాలి. రొయ్యల్లో కేలరీలు తక్కువగా ఉంటాయి. పైగా ఇది పోషకాహారం కాబట్టి బరువు తగ్గాలనుకునే వారు రొయ్యలను తరచూ తింటే మంచిది. దీనిలో సెలీనియం ఉంటుంది. రొయ్యల్లో ఉండే సెలెనియం శరీరంలో క్యాన్సర్ కణాలు పెరగకుండా అడ్డుకుంటాయి. కాబట్టి రొయ్యలను వారానికి కనీసం ఒక్కసారైనా తినడానికి ప్రయత్నించండి. ముఖ్యంగా పిల్లల చేత తినిపించేందుకు ప్రయత్నించండి.