Monday, October 28, 2024

ప్రేమించిన వారికోసం ప్రేమగా తగ్గండి, ఆజ్ఞాపించడం మాని ఆప్యాయంగా చెప్పండి, అప్పుడు అందరూ మీ వెంటే-wednesday motivation be kind to the ones you love tell us lovingly to command then everyone will follow you ,లైఫ్‌స్టైల్ న్యూస్

ప్రేమంటే పొందటమే కాదు ఇవ్వడం కూడా. ముందు మీరు ప్రేమను ఇచ్చి చూడండి, అంతే రెట్టింపు ప్రేమ అటు నుంచి మీరు కూడా అందుకుంటారు. ప్రేమించడమే గొప్ప కాదు. ఒకరి చేత ప్రేమించబడడం కూడా అద్భుతమైన వరమే. అది కేవలం అబ్బాయి అమ్మాయి మధ్య ప్రేమ కానక్కర్లేదు. ఒక యజమాని కార్మికుడి మధ్య ఉండాల్సిన ప్రేమ, ఆప్యాయత కూడా కావచ్చు . అలాగే భార్యాభర్తలు, తల్లి బిడ్డలు, స్నేహితులు… ఇలా ఎవరి మధ్య అయినా ప్రేమ అందంగా, ప్రశాంతంగా ఉండాలి. అంతే తప్ప సరిహద్దులతో, శాసనాలతో, ఆదిపత్యాలతో నిండిపోతే ఆ బంధం త్వరగా విరిగిపోతుంది. ప్రేమ కోసం మీరు ప్రేమగా తగ్గితే ఎలాంటి తప్పులేదు. మరింత మంది మీకు అండగా నిలిచేందుకు వస్తారు. ఒక్కసారి ఇంట్లో వారిని లేదా మీ స్నేహితులను ప్రేమగా పిలిచి చూడండి. ఆ ప్రేమకు వారు కరిగిపోకుండా ఉండరు. వీలైనంతవరకు ప్రేమించండి. ద్వేషించడం వల్ల వచ్చేది కోపం, అశాంతి, ఆందోళన మాత్రమే. అవి జీవితంలో మీకు ఎందుకూ పనికిరావు. ఆరోగ్యాన్ని చెడగొట్టడానికి తప్ప.

Related Articles

Stay Connected

0FansLike
0FollowersFollow
0SubscribersSubscribe
- Advertisement -spot_img

Telangana