తిరుపతికి సమీపంలోని శ్రీకాళహస్తి ఆలయంలో విదేశీయులు రాహుకేతు పూజలు చేశారు. ఈ పూజలు ఆదివారంతోపాటు ప్రత్యేక రోజుల్లో అనువైనవిగా భావిస్తారు. ఈ క్రమంలోనే ఆదివారం విదేశీయుల ఈ పూజల్లో పాల్గొన్నారు. ఒకేసారి పదుల సంఖ్యలో విదేశీయుల రాహుకేతు పూజ చేశారు. విదేశీయులైనప్పటికీ హిందూ సంప్రదాయం ప్రకారం గొప్ప విషయమని ఆలయ అర్చకులు అంటున్నారు.