అసెంబ్లీకి వెళ్లే సభ్యులను అడ్డుకునే హక్కు పోలీసులకు ఎక్కడిదని టీడీపీ ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ ప్రశ్నించారు. సచివాలయం అగ్నిమాపక కేంద్రం వద్ద ‘బైబై జగన్’ అంటూ ప్లకార్డులు పట్టుకొని టీడీపీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు నిరసన తెలిపారు. బారికేడ్లు అడ్డుపెట్టి పోలీసులు వారిని అడ్డుకోవడంతో నేతలు వాగ్వాదానికి దిగారు. జాబ్ క్యాలెండర్ విడుదల ఎప్పుడు? పోలవరం పూర్తి ఎక్కడా? అని నినాదాలు చేశారు. ఈ సందర్భంగా బాలకృష్ణ మాట్లాడుతూ పనైపోయిన వైకాపా ప్రభుత్వం గురించి ప్రత్యేకంగా చెప్పేందుకు ఏముంటుందని వ్యాఖ్యానించారు.