Ola Uber fixed rates in Karnataka : రద్దీ సమయాల్లో ట్యాక్సీ సేవల రేట్లు హడలెత్తిస్తూ ఉంటాయి. చిన్న దూరానికే భారీగా రేట్లు చూపిస్తూ ఉంటాయి యాప్ ఆధారిత ట్యాక్సీ సేవలు ఓలా, ఊబర్. ఈ విషయం నిత్యం సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతూనే ఉంటుంది. నెటిజన్లు.. తమ అంసతృప్తిని బయటపెడుతూనే ఉంటారు. ఇక ఇప్పుడు.. ఈ విషయంపై కర్ణాటక ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఓలా, ఊబర్ వంటి యాప్ ఆధారిత టాక్సీ సేవలకు.. సమానమైన, ఫిక్స్డ్ రేట్లను అమలు చేయాలని నిర్ణయించింది. కానీ ఇక్కడే ఒక ట్విస్ట్ ఉంది!