ఏపీ అసెంబ్లీ సమావేశాల సందర్భంగా గవర్నర్ అబ్దుల్ నజీర్ ఉభయ సభలను ఉద్దేశించి ప్రసంగించారు. తమ సర్కారు బడుగు బలహీన వర్గాల అభ్యున్నతికి కట్టుబడి ఉందని తెలిపారు. సామాజిక న్యాయం, సమానత్వం కోసం ఈ ప్రభుత్వం పని చేస్తోందని పేర్కొన్నారు. విజయవాడలో 206 అడుగుల అంబేద్కర్ విగ్రహం ఏర్పాటు అభినందనీయమన్న గవర్నర్ పాఠశాలల్లో మౌలిక వసతులకు ప్రాధాన్యత ఇస్తున్నామని తెలిపారు. దేశంలో ఎక్కడా లేని విధంగా విద్యలో సంస్కరణలు తెచ్చామన్నారు.