ఆ 75 సినిమాల్లోనూ ఓ15 వరకూ చాలా మంచి సినిమాలని అతడు చెప్పాడు. “హనుమాన్ కోసం నేను సుమారు 25 లుక్ టెస్టులు ఇచ్చాను. సాధారణంగా ఓ సినిమా కోసం ఏ నటుడైనా రెండు, మూడు టెస్టులు మాత్రమే ఇస్తారు. ఈ మూవీలో స్టంట్స్ అన్నీ నేనే చేశాను. బాడీ డబుల్ లేదా వీఎఫ్ఎక్స్ ఉపయోగించలేదు. స్కూబా డైవింగ్ నేర్చుకొని మరీ నీటి లోపల సీక్వెన్స్ షూట్ చేశాను” అని తేజ సజ్జా చెప్పడం విశేషం.