సినిమా షూటింగ్ దశలో ఉన్నప్పుడు క్షణం తీరిక లేకుండా గడిపే సినీ సెలబ్రిటీలు కొద్దిగా గ్యాప్ దొరికితే చాలు వాళ్ళకి నచ్చిన రీతిలో ఎంజాయ్ చేస్తుంటారు. ఇందుకోసం రకరకాల ప్రదేశాలకి కూడా వెళ్తుంటారు. ఇప్పుడు ఇదే కోవలో కొంత మంది హీరోయిన్లు ఎంజాయ్ చేస్తున్నారు. ఇప్పుడు ఈ ఫోటోలు వైరల్ అవుతున్నాయి.
రకుల్ ప్రీత్ సింగ్, ప్రగ్యా జైస్వాల్, మంచు లక్ష్మి ఈ ముగ్గురు గురించి తెలుగు ప్రేక్షకులకి పెద్దగా పరిచయం అక్కర్లేదు. ఎన్నో సినిమాల్లో ఆధ్బుతమైన పాత్రల్లో నటించి తెలుగు సినిమా ప్రపంచంలో తమ ప్రస్థానాన్ని కొనసాగిస్తు వస్తున్నారు.ఇప్పుడు ఈ ముగ్గురు సముద్రం మధ్యలో ఉన్న ఒక బోట్ లో కొన్ని పిక్స్ దిగారు. తమ ఫ్రెండ్స్ తో కలిసి దిగిన ఆ పిక్స్ ని ప్రగ్యా తన సోషల్ మీడియా అకౌంట్ లో పోస్ట్ చెయ్యడంతో విషయం బయటకి తెలిసింది.కాకపోతే ప్లేస్ ఎక్కడో తెలియదు.
ఆ పిక్స్ లో ప్రగ్యా ,రకుల్, లక్ష్మి లతో పాటు రన్ రాజా రన్ ఫేమ్ సీరత్ కపూర్ కూడా ఉంది. రకుల్ ప్రీత్ సింగ్ ఇటీవల అయలాన్ చిత్రంతో ఆడియెన్స్ ముందుకు వచ్చింది. మంచు లక్ష్మి ఆదిపర్వం అనే సినిమాలో నటించింది. ఈ చిత్రం త్వరలోనే ఆడియెన్స్ ముందుకు రాబోతుంది. ప్రగ్యా కొన్ని కొత్త చిత్రాలకి కమిట్ అయ్యింది. ఆ విషయాలు త్వరలోనే వెల్లడి కానున్నాయి.