Home ఎంటర్టైన్మెంట్ నాగార్జున పాన్ ఇండియా మూవీ..బడ్జట్, దర్శకుడు తో ఫ్యాన్స్ ఖుషి

నాగార్జున పాన్ ఇండియా మూవీ..బడ్జట్, దర్శకుడు తో ఫ్యాన్స్ ఖుషి

0

పాత్ర ఏదైనా సరే ఆ పాత్రలోకి పరకాయ ప్రవేశం చేసి ఆ పాత్ర గురించి తెలుగు ప్రజలు తమ రోజు వారి దినచర్యగా మాట్లాడుకునేలా చెయ్యడం నాగార్జున నటనకి ఉన్న స్టైల్. తన మూడున్నర దశాబ్దాల సినీ కెరీర్ లో ఆయన పోషించని పాత్ర  లేదు. ఎన్నో సూపర్ హిట్ సినిమాలని అందించి తెలుగు కళామ తల్లికి తన వంతు సేవ చేస్తు వస్తున్నాడు. మొన్న  సంక్రాంతికి నా సామిరంగ తో అదిరిపోయే హిట్ ఇచ్చి తన స్టామినా శాశ్వతం అని మరోసారి నిరూపించాడు.తాజాగా   ఆయన నటించబోయే  సినిమా టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీగా మారింది.

నాగార్జున ప్రస్తుతం శేఖర్ కమ్ముల దర్శకత్వంలో వస్తున్న మూవీ చేస్తున్నాడు. ఆల్రెడీ షూటింగ్ కూడా ప్రారంభం అయిన ఈ మూవీలో నాగ్  ధనుష్ తో కలిసి స్క్రీన్ షేర్ చేసుకుంటున్నాడు.తాజాగా మరో కొత్త మూవీని నాగ్ లూప్ లైన్ లోకి తీసుకొచ్చాడు. ప్రముఖ తమిళ దర్శకుడైన నవీన్ తో  నాగ్ ఒక మూవీ  చేయబోతున్నాడు. ఈ విషయాన్ని స్వయంగా నాగార్జునే కొన్ని రోజుల క్రితం వెల్లడించాడు.ఇప్పుడు ఈ సినిమా  100 కోట్ల  భారీ బడ్జెట్‌తో తెరకెక్కబోతుంది. నాగార్జున  సినీ కెరీర్ లోనే అంత భారీ వ్యయంతో తెరకెక్కబోతున్న హయ్యెస్ట్ మూవీ ఇదే అని చెప్పవచ్చు. పాన్ ఇండియా ప్రాజెక్ట్‌గా ముస్తాబు అవ్వబోతున్న ఈ మూవీకి  తమిళంలో ఎన్నో హిట్ చిత్రాలని నిర్మించిన జ్ఞానవేల్ రాజా నిర్మాతగా వ్యవహరిస్తున్నాడు.

ఇప్పుడు ఈ  వార్తలతో నాగార్జున అభిమానులు ఫుల్ జోష్ తో ఉన్నారు. రెండు దశాబ్దాల క్రితమే నాగార్జున  సౌత్ ఇండియా స్టార్ గా ఉన్నాడని ఎప్పటినుంచో తాము నాగార్జున ఇలాంటి సినిమాలు చెయ్యాలని కోరుకుంటున్నామని అంటున్నారు.మూవీకి  సంబంధించిన మిగతా ఆర్టిస్ట్ ల వివరాలతో పాటు సాంకేతిక నిపుణల పేర్లు కూడా త్వరలోనే వెల్లడి కానున్నాయి. ఇక దర్శకుడు  నవీన్  చివరిగా  అరుణ్ విజయ్ నటించిన  అగ్ని సిరగుగల్ చిత్రానికి దర్శకత్వం వహించాడు.

 


 

Exit mobile version