రాజధాని మార్పు తీవ్ర నిర్ణయం
“రాజధాని మార్పు తీవ్ర నిర్ణయమని అప్పుడే చెప్పాను. సీఎం జగన్ నివాసంలో సజ్జల రామకృష్ణా రెడ్డి, బొత్స సత్యనారాయణ రాజధానుల సమావేశంలో నా అభిప్రాయం చెప్పాను. రాజధాని మార్చాలనుకుంటే వైజాగ్ లో అసెంబ్లీ(Assembly) పెట్టి, సెక్రటేరియట్ అమరావతిలో ఉంచితే సమస్య ఉండదని చెప్పాను. కానీ నా మాటలు సీఎం జగన్ పట్టించుకోలేదు. సీఎం జగన్ నిర్ణయం ఫైనల్ అని కొడాలి నాని అన్నారు. సీఎం నిర్ణయానికి ఎదురు చెప్పకూడదన్నారు. అంబటి రాంబాబు లేచి సీఎం నివాసంలో ఆయన నిర్ణయాన్ని ప్రశ్నించే పరిస్థితి ఉండకూడదన్నారు. కానీ ఆ రోజు నేను, మల్లాది విష్ణు రాజధాని మార్చవద్దని కోరాం. మా అభిప్రాయాన్ని చెప్పకుండా మా గొంతు నొక్కుతున్నారని చెబితే సజ్జల, బొత్స, అంబటి మమ్మల్ని వారించారు”- ఎమ్మెల్యే వసంత కృష్ణ ప్రసాద్